Odisha: శ్మశానం నుంచి మాయమవుతున్న మృతదేహాలు!

Missing Bodies Mystery in Odisha Graveyard
  • ఒడిశాలో షాకింగ్ ఘటన
  • గత కొన్ని వారాల వ్యవధిలో 4 మృతదేహాలు మాయం
  • గడచిన 8 ఏళ్లలో 15 మృతదేహాలు గల్లంతు
ఒడిశాలోని భద్రక్ జిల్లా భండారీ పీఎస్ పరిధిలో ఉన్న మణినాథ్ పూర్ గ్రామంలో విస్మయకర సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడి శ్మశానం నుంచి మృతదేహాలు మాయమవుతున్నాయి. దీనిపై గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. గత కొన్ని వారాల వ్యవధిలోనే 4 మృతదేహాలు గల్లంతవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 2017 నుంచి చూస్తే, ఈ శ్మశానవాటికలో మొత్తం 15 మృతదేహాలు మాయమయ్యాయి. 

ఇటీవలే ఓ మహిళ చనిపోగా, ఆమెను పూడ్చిపెట్టారు. దశ దిన కర్మల కోసం 10వ రోజున కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, అక్కడ తవ్వకం జరిగి ఉండడం గమనించారు. మృతదేహం కనిపించకపోవడంతో వారు నివ్వెరపోయారు. అయితే, దీని వెనుక ప్రైవేటు వైద్య కళాశాలల మాఫియా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Odisha
Bhadrak district
Maninathpur
Missing bodies
Graveyard
Cremation ground
Odisha crime
Body theft
Private medical colleges
Mafia

More Telugu News