Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజు గారికి శుభాకాంక్షలు: నారా లోకేశ్
- గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు
- నేడు ప్రమాణ స్వీకారం
- హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్
సీనియర్ రాజకీయవేత్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా గవర్నర్ గా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. దీనిపై లోకేశ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
"నేడు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాను. అశోక్ గజపతిరాజు గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశాను" అంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.