దేవుడికి వెండి రివాల్వర్, తుపాకీ గుండ్లను కానుకగా సమర్పించిన భక్తుడు..!
- రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌లోని ప్రసిద్ధ సావరియా సేఠ్ ఆలయంలో ఘటన
- కానుకగా వెండి రివాల్వర్, తుపాకీ గుండ్లు, రెండు వెల్లుల్లిపాయలు
- గతంలోనూ ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడికి భక్తుల విభిన్న కానుకలు
అయితే, దేవునికి ఓ ఆయుధాన్ని కానుకగా సమర్పించడం ఇదే మొదటిసారి అని ఆలయ ఛైర్మన్ జానకీదాస్ తెలిపారు. కాగా, గతేడాది రాజస్థాన్ లో వెల్లుల్లిపాయల ధర ఆకాశాన్ని తాకింది. బహుశా ఎవరైనా వెల్లుల్లి రైతు భారీగా లాభాలు రావడంతో ఇలా దేవుడికి సమర్పించి ఉండొచ్చని ఆలయ ఛైర్మన్ పేర్కొన్నారు.
ఇక, ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారికి ఇలా విభిన్న కానుకలు సమర్పించడం ఇదే తొలిసారి కాదట. గతంలో వెండి పెట్రోల్ పంపు, ట్రాక్టరు, ల్యాప్‌టాప్, విమానం, ఐఫోన్ వంటి కానుకలు కూడా వచ్చాయి. ఇక్కడ వెలసిన శ్రీకృష్ణుడిని సంపదకు అధిపతిగా సేఠ్ అని పూజిస్తారు.