Mithun Reddy: మిథున్ రెడ్డికి ఇంటి భోజనం, అటెండర్ సౌకర్యంపై ఏసీబీ కోర్టులో జైళ్ల శాఖ పిటిషన్

Mithun Reddy Jail Department Petition on Home Food Attender Facility
  • ఇంటి భోజనం అనుమతించలేమని జైళ్ల శాఖ పిటిషన్
  • అటెండర్ సౌకర్యం కల్పించలేమని పిటిషన్‌లో పేర్కొన్న జైళ్ల శాఖ
  • కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశాలు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో ఇంటి భోజనం అనుమతించలేమని, అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే.

జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చింది. వెస్ట్రన్ కమోడ్‌తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టీవీని అనుమతించాలని కోర్టు పేర్కొంది.

అయితే, జైలులో ఆయనకు ఇంటి భోజనం అనుమతించలేమని ఏసీబీ కోర్టులో జైళ్ల శాఖ పిటిషన్ దాఖలు చేసింది. అటెండర్ సౌకర్యం కల్పించలేమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
Mithun Reddy
Mithun Reddy arrest
YSRCP MP
ACB Court Vijayawada
Jail facilities

More Telugu News