Revanth Reddy: 'కన్వర్టెడ్ బీసీ' అనే పదాన్ని రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకు వచ్చారు: రామచందర్ రావు

Ramachander Rao Criticizes Revanth Reddys Converted BC Remark on Modi
  • నరేంద్ర మోదీ బీసీ కాదంటూ బీసీ సమాజాన్ని అవమానించారని విమర్శ
  • రాహుల్ గాంధీ గురించి అడిగితే కాంగ్రెస్ నేతలు ఏం చెబుతారని ప్రశ్న
  • ఆయనకు గోబెల్స్ బహుమతి ఇవ్వాలని చురక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ కాదంటూ బీసీ సమాజాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రాహుల్ గాంధీ గురించి అడిగితే కాంగ్రెస్ నాయకులు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, మోదీ కన్వర్టెడ్ బీసీ అనే పదాన్ని రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకు వచ్చారని విమర్శించారు. అందుకు ఆయనకు గోబెల్స్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర బీజేపీ కమిటీలో 20 పోస్టులు మాత్రమే ఉన్నాయని రామచందర్ రావు అన్నారు. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులు, ఒక కోశాధికారి పోస్టు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అయినందువల్లే జంబో కమిటీ ఉంటుందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా తనకు ఎలాంటి రాష్ట్ర పదవి లేదని, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని అన్నారు.
Revanth Reddy
Ramachander Rao
Telangana BJP
Narendra Modi BC
Converted BC

More Telugu News