ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు: నిమ్మల రామానాయుడు
- ఏపీ ముఖ్యమంత్రిపై మంత్రి నిమ్మల పొగడ్తల వర్షం
- తలకాయలు తీసే నేత అంటూ జగన్ పై ఫైర్
- తిరుపతి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యలు
స్వల్పకాలంలోనే మంచి ప్రభుత్వమని పేరు..
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలతో స్వల్ప కాలంలోనే మంచి ప్రభుత్వమనే పేరు తెచ్చుకున్నామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ, అన్న క్యాంటీన్లతో రోజుకు 2.5 లక్షల మందికి భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబులేనని చెప్పారు. వైసీపీ నేతలు తమ కక్షలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికే మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు.