నిద్రమత్తులో ఇంటిగోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి.. ఇదిగో వీడియో!
- మేడ్చల్-దుండిగల్ పీఎస్ పరిధిలోని శంభీపూర్‌లో ఘటన
- నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ కారును ఇంటి గోడపైకి ఎక్కించిన వైనం
- కారును క్రేన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు
శంభీపూర్‌లో నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ కారును ఇంటి గోడపైకి ఎక్కించాడు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో ఇంటి యజమానులు నిద్రలేచి బయటకు వచ్చి చూశారు. ఇంటి బయట కనిపించిన దృశ్యం చూసి వారు నివ్వెరపోయారు.
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందకు దింపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుండగా.. నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.