ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు
- విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు
- టెండర్లు పిలవాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో ప్రాజెక్టు
మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.10,118 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మొదట ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.