KTR: తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పుట్టినరోజు వేడుక.. ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన యువతి!

KTR Birthday Celebrations at Telangana Bhavan Woman Attempts to Kiss
  • తెలంగాణ భవన్‌లో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కేటీఆర్
  • తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు
  • కేటీఆర్‌తో మాట్లాడి, సెల్ఫీ దిగిన ఓ యువతి
  • ముద్దు పెట్టేందుకు ముందుకు రాగా వారించిన కేటీఆర్
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని ఆయనతో ముచ్చటించి, సెల్ఫీ దిగింది. అనంతరం ముద్దు పెట్టడానికి ప్రయత్నించగా, కేటీఆర్ సున్నితంగా వెనక్కి తగ్గి ఆమెను వారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయింది.
KTR
KTR birthday
KTR birthday celebration
Telangana Bhavan
BRS party
Telangana politics

More Telugu News