Narendra Modi: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం... సంతకాలు చేసిన ఇరుదేశాలు

Narendra Modi India UK sign historic trade agreement
  • స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం
  • మోదీ, కీర్ స్మార్టర్ సమక్షంలో సంతకాలు చేసిన వాణిజ్య శాఖల మంత్రులు
  • ఇరు దేశాల మధ్య 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా
భారత్, బ్రిటన్ దేశాలు చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

దీని ద్వారా భారత్ - బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. యూకేలో ఆయన రెండు రోజులు పర్యటిస్తారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవులలో పర్యటిస్తారు.
Narendra Modi
India UK trade deal
India Britain relations
Rishi Sunak
India trade agreements

More Telugu News