మేము జన సమీకరణ చేయలేదు: విడదల రజని
- నేడు పోలీసు విచారణకు హాజరైన విడదల రజని
- జనం గుండెల్లో జగన్ ఉన్నారని వ్యాఖ్య
- జగన్ కోసం ప్రజలు వారంతట వారే వస్తున్నారన్న రజని
జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టారని రజని అన్నారు. పోలీసుల ద్వారా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మోసపోయామని జగన్ కు ప్రజలు చెబుతున్నారని అన్నారు.
ఏడాది కాలంగా వైసీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని విమర్శించారు. మిథున్ రెడ్డిపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చుట్టూ ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.