Mithun Reddy: మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే... ప్రధాన లబ్ధిదారుడు జగనే: యనమల

Yanamala Alleges Jagan Looted Rupees 3500 Crore in Liquor Scam
  • ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్
  • రూ.3,500 కోట్లు దోచుకున్నారన్న యనమల
  • రికవరీ చట్టం అమలు చేయాలని సూచన
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ లిక్కర్ స్కాంలో జగన్ రూ.3,500 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఈ స్కాంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే... జగన్ ప్రధాన లభ్దిదారుడు అని యనమల స్పష్టం చేశారు. 

లిక్కర్ స్కాంలో దోచుకున్న సొమ్మును రాబట్టేందుకు రికవరీ చట్టాన్ని అమలు చేయాలని, లేదా మరో చట్టం తీసుకురావాలని అన్నారు. లిక్కర్ స్కాం కేసును కక్షపూరిత కేసు అని వైసీపీ నేతలు అంటున్నారని, నేరం నుంచి తప్పించుకునేందుకు వారు అలా అంటున్నారని విమర్శించారు. కుంభకోణాలకు పాల్పడిన వారిని ప్రజాకోర్టులోకి తీసుకురావాలని అన్నారు. 
Mithun Reddy
YS Jagan
Andhra Pradesh
AP Liquor Scam
Liquor Scam
Yanamala Ramakrishnudu
TDP
Corruption
AP Politics

More Telugu News