MK Stalin: చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్

Tamil Nadu CM Stalin Hospitalized
  • సీఎం స్టాలిన్ కు స్వల్ప అస్వస్థత
  • మార్నింగ్ వాక్ చేస్తుండగా కళ్లు తిరిగిన వైనం
  • ఆరోగ్యపరంగా స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్న వైద్యులు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా... ఆయనకు కళ్లు తిరిగినట్టు అనిపించింది. దీంతో, ఆయనను హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. స్టాలిన్ ను ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆయన కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు, స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

తాజాగా, అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ స్పందిస్తూ... ఆరోగ్యపరంగా స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆయన లక్షణాలను పరిశీలించామని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.
MK Stalin
Tamil Nadu CM
Stalin Health
Apollo Hospital Chennai
Udhayanidhi Stalin
DMK
Tamil Nadu Politics
Health Update

More Telugu News