Nara Lokesh: ఆ అమ్మాయిని మీరు కంగారుపెడుతున్నారు... ఆమె బాగానే మాట్లాడుతోంది... హోస్ట్ కు నారా లోకేశ్ భరోసా

Nara Lokesh Supports Host at Guntur Event
  • గుంటూరులో మెగా సీఏ విద్యార్థుల సమావేశం
  • హాజరైన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 
  • లోకేశ్ పేరు పలకడంలో తడబడిన హోస్ట్
  • ఆమె నుంచి మైక్ తీసుకున్న మరో హోస్ట్
  • ఫర్వాలేదు, ఆమెకు మైక్ ఇవ్వండంటూ లోకేశ్ భరోసా
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుంటూరులో మెగా సీఏ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి నిషా భాగేచా అనే సీఏ విద్యార్థిని హోస్ట్ గా వ్యవహరించింది. అయితే, నారా లోకేశ్ ను వేదికపైకి పిలిచే క్రమంలో పేరును పలకడంలో ఆ అమ్మాయి తడబడింది. దాంతో మరో హోస్ట్ ఆమె నుంచి మైక్ అందుకుని నారా లోకేశ్ ను వేదికపైకి ఆహ్వానించాడు. 

దాంతో వేదికపైకి వెళ్లిన నారా లోకేశ్... ఆ అమ్మాయి సరిగానే మాట్లాడుతోంది... ఎందుకు ఆ అమ్మాయిని కంగారుపెడుతున్నారు... తనకు మైక్ ఇవ్వండి అంటూ ఆ విద్యార్థినికి మైక్ ఇప్పించారు. అనంతరం ఆ అమ్మాయి చక్కగా యాంకరింగ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా  ఖాతాలో పంచుకుంది. 
Nara Lokesh
AP Education Minister
CA Students
Nisha Bhagecha
Guntur
TDP
Andhra Pradesh
Mega CA Students Meeting

More Telugu News