Nithya Menen: పెద్ద హీరోలతో నటించడం వేస్ట్!: నిత్యామీనన్

Nithya Menen says acting with big heroes is a waste
  • పెద్ద హీరోలతో నటించడం వల్ల ఉపయోగం లేదన్న నిత్యామీనన్
  • చిన్న హీరోలతో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని వ్యాఖ్య
  • తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే తాను ఆ సినిమా చేస్తానన్న నిత్య
దక్షిణాది చిత్రసీమలో ట్యాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె... స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'అలా మొదలైంది' సినిమాతో తెలుగులోని ఎంట్రీ ఇచ్చింది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలలో నటించిన నిత్య... బాలీవుడ్ లో సైతం మెరిసింది. 'భీమ్లా నాయక్' తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు.

తాజాగా బడా హీరోలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో నటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నిత్య చెప్పింది. చిన్న హీరోల సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లకు మంచి పేరు వస్తుందని, కిక్ ఉంటుందని తెలిపింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పింది. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. 
Nithya Menen
Nithya Menen movies
Telugu cinema
South Indian cinema
Bheemla Nayak
Heroine roles
Tollywood
Small heroes
Female actors

More Telugu News