F-35B Fighter Jet: మొత్తానికి ఓకే అయిన బ్రిటిష్ ఎఫ్-35 యుద్ధ విమానం.. మరమ్మతులు విజయవంతం

Royal Navy F 35B Jet Repaired in Thiruvananthapuram
  • ఈ నెల 14 నుంచి కేరళలో చిక్కుకుపోయిన బ్రిటిష్ యుద్ధ విమానం
  • మరమ్మతుల కోసం వచ్చిన 25 మంది ఇంజినీర్ల బృందం
  • ఈ ఉదయం హ్యాంగర్ నుంచి విమానం బయటకు
  • యూకేకు బయలుదేరడానికి ముందు ట్రయల్ ఫ్లైట్ నిర్వహణ
ఈ నెల 14 నుంచి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానం హైడ్రాలిక్ సిస్టమ్ లోపాన్ని ఎట్టకేలకు సరిచేశారు. ఈ విమానం యూకేకు బయలుదేరడానికి ముందు ట్రయల్ ఫ్లైట్ నిర్వహించనున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రాయల్ నేవీకి చెందిన ప్రముఖ విమాన వాహక నౌక హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి విమానాన్ని డైవర్ట్ చేసి ఈ నెల 14న కేరళలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 

ఈ ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానం ఖరీదు దాదాపు 115 మిలియన్ డాలర్లు. ల్యాండింగ్ గేర్, బ్రేక్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సర్ఫేస్‌ల వంటి కీలక భాగాలను ప్రభావితం చేసే హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా గత నెల రోజులుగా ఇది తిరువనంతపురంలోనే హ్యాంగర్‌కు ఉండిపోయింది. 

ఈ నెల 6న బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ 400ఎం అట్లాస్‌లో వచ్చిన 25 మంది బ్రిటిష్ ఇంజనీర్ల బృందం ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) హ్యాంగర్‌లో ఈ విమానానికి మరమ్మతులు ప్రారంభించింది.

ఈ ఉదయం ఎఫ్-35బి విమానాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తీసుకొచ్చారు, మరమ్మతులు విజయవంతం కావడంతో యూకేకు తిరిగి వెళ్లేముందు నేడు కానీ, రేపు కానీ ట్రయల్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం ఇది యూకేకు వెళ్లనుంది.  
F-35B Fighter Jet
British F-35B
Royal Navy
Thiruvananthapuram Airport
HMS Prince of Wales
Hydraulic System Failure
Stealth Aircraft
Air India MRO
UK
Kerala

More Telugu News