YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు

YS Viveka Murder Case Supreme Court Asks CBI for Input on Three Points
  • వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ
  • అవినాశ్ సహా పలువురు నిందితులకు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
  • తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సునీత, సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. 

సీబీఐ అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరిన అంశాలు ఇవే:
  • ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా?
  • కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏమిటి?
  • కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా?

ఈ మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాలు చెప్పిన తర్వాత... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ కేసులో అవినాశ్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు కోరుతూ వివేకా కూతురు సునీత, సీబీఐ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. అవినాశ్ తో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ, సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
YS Viveka
YS Vivekananda Reddy murder case
Avinash Reddy
Sunitha Reddy
CBI investigation
Kadapa sessions court
Supreme Court hearing
bail cancellation petition
Andhra Pradesh politics
Telangana High Court

More Telugu News