ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
- రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
- ముగ్గురు అక్కడికక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కారులోనుంచి అతికష్టంమీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.