Andhra Pradesh Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు కీలక ఆదేశాలు!

Andhra Pradesh Liquor Scam Key Court Orders
  • నిందితుల ఆస్తుల జప్తునకు విజయవాడ కోర్టు అనుమతి
  • రూ. 32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు
  • ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీలోగా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రూ. 32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జప్తు చేయనున్న వాటిలో, గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ. 8 కోట్ల నగదు కూడా ఉంది. అలాగే డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి.
Andhra Pradesh Liquor Scam
AP Liquor Scam
Vijayawada Court
Asset Seizure

More Telugu News