Pragya Agarwal: తన నివాసంలో విగతజీవురాలిగా కనిపించిన మహిళా ప్రొఫెసర్

Professor Pragya Agarwal Found Dead in Jabalpur Home
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు
  • కొనసాగుతున్న దర్యాప్తు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 55 ఏళ్ల మహిళా ప్రొఫెసర్‌ ప్రజ్ఞా అగర్వాల్‌ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఇంట్లో పదునైన ఆయుధంతో కోసుకున్న గాయాలు, మెడపై కోతలు ఉండటంతో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే, పోలీసులు దీన్ని అసాధారణ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

ఉదయం పనిమనిషి ప్రజ్ఞా అగర్వాల్‌ ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె విగతజీవిగా పడి ఉన్నారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, ప్రజ్ఞా మణికట్టు, మెడపై లోతైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో రక్తం మరకలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు అనిపించినప్పటికీ, అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నామని, ఆమె ఇంట్లో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. గాయాలు ఆమె చేసుకున్నవేనా, లేదా ఎవరైనా దాడి చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజ్ఞా అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన వివరాలను సేకరిస్తున్నారు. ఆమె సన్నిహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి సమాచారం రాబడుతున్నారు. 
Pragya Agarwal
Jabalpur
Madhya Pradesh
Professor Death
Suicide Investigation
Crime News
Unnatural Death
Police Investigation
Forensic Report

More Telugu News