Delhi Earthquakes: ఢిల్లీలో భూప్రకంపనలు.. ఈ వారంలో రెండోసారి
- హర్యానాలో 3.7 తీవ్రతతో భూకంపం
- రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
- ఝజ్ఝర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తింపు
దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూకంప ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం ఏడు గంటల సమయంలో హర్యానాలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఢిల్లీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఝజ్జర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
రెండు రోజుల వ్యవధిలో హర్యానాలో ఇది రెండో భూకంపం. ఈ భూకంపం దాటికి ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
రాత్రి 7.49 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. హర్యానాలోని రోహ్తక్, బహదూర్‌గఢ్ జిల్లాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. నిన్న ఉదయం ఝజ్జర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న కూడా ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.