Donald Trump: వందలాది మంది దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లకు ట్రంప్ ప్రభుత్వం షాక్!

Donald Trump Government to Layoff 1300 Diplomats Civil Servants
  • తొలగించేందుకు అమెరికా సిద్ధం
  • తొలగింపు జాబితాలో 1107 మంది సివిల్ సర్వెంట్లు, 246 మంది దౌత్యవేత్తలు
  • లేఆఫ్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడి
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వందల సంఖ్యలో ఉన్నతాధికారులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ తొలగింపు జాబితాలో 1,107 మంది సివిల్ సర్వెంట్లు, స్థానికంగా పనిచేస్తున్న 246 మంది దౌత్యవేత్తలు ఉన్నారని సమాచారం. సంబంధిత వర్గాల సమాచారం మేరకు, వీరికి లేఆఫ్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది.

నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లు 120 రోజుల పాటు సెలవుల్లో ఉంటారని, ఆ తర్వాత వారిని అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిలో ఎక్కువ మందికి 60 రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దౌత్య ప్రాధాన్యతలపై దృష్టి సారించామని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో పాటు వారి మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. అయితే, ప్రస్తుత మరియు మాజీ దౌత్యవేత్తలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చర్యల వలన విదేశాల్లో ఇప్పటికే ఉన్న ముప్పుతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం బలహీనపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగాల కోతలను నిలిపివేయాలని కోరుతూ అమెరికన్ ఫారెన్ సర్వీసెస్ అసోసియేషన్ గత నెలలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశీ సేవలు అందించే ఈ విభాగానికి అంతరాయం కలిగించడం జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లపై దీని ప్రభావం పడుతుందని సంస్థ అధ్యక్షుడు టామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Donald Trump
Trump administration
US diplomats
Civil servants layoff
Marco Rubio
American Foreign Services Association
US Foreign policy
Layoff notices
Tom
US Department

More Telugu News