Kavitha: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది?: కవిత

MLC Kavitha criticizes BJP after Gujarat bridge accident
  • గుజరాత్‌లో కుప్పకూలిన గంభీర వంతెన
  • ప్రమాదంలో పది మందికి పైగా మృతి
  • ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదన్న కవిత 
గుజరాత్‌లో మరో వంతెన కూలిన ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గొప్పగా చెప్పుకునే ‘గుజరాత్ మోడల్’, ‘డబుల్ ఇంజన్ సర్కార్’ పనితీరు ఇదేనా అంటూ ఘాటు విమర్శలు చేశారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే వంతెనలు ఎందుకు కూలుతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనతో బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ మరోసారి బయటపడిందని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ) లేదా ఇతర ఏజెన్సీలతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు.

ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు. “మొన్న మోర్బీ వంతెన కూలి వందల మంది చనిపోయిన ఘటన మరువక ముందే, ఇప్పుడు గంభీర వంతెన కూలి పది మంది మృతి చెందడం బాధాకరం. బీజేపీయేతర రాష్ట్రాల్లో చిన్న సంఘటన జరిగితే రాద్ధాంతం చేసే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది?” అని కవిత ప్రశ్నించారు.

గుజరాత్‌లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన మంగళవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోగా, సుమారు పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 
Kavitha
MLC Kavitha
Gujarat bridge collapse
BRS party
KTR
Double engine government
Vadodara bridge
Gambhira bridge
BJP
Mahisagar river

More Telugu News