Mohan Babu: విజయవాడలో ‘కన్నప్ప’ స్పెషల్ షో... అఘోరాలు, నాగ సాధువులతో కలిసి వీక్షించిన మోహన్ బాబు

Mohan Babu Watches Kannappa Special Show in Vijayawada
  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప
  • జూన్ 27న విడుదల
  • విజయవాడలో కన్నప్ప ప్రత్యేక ప్రదర్శన
  • సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • సాధువులతో కలిసి సినిమా చూడటం సంతోషంగా ఉందన్న మోహన్ బాబు
  • విష్ణు నటన అద్భుతమంటూ ప్రశంసించిన గజల్ శ్రీనివాస్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’కి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. డివోషనల్ బ్లాక్ బస్టర్‌గా ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు విజయవాడలో ప్రఖ్యాత గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 'కన్నప్ప' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోని నటుడు మోహన్ బాబుతో పాటుగా నాగ సాధువులు, అఘోరాలు వీక్షించారు. 

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... ‘‘కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. ఇక ఈ రోజు ఇలా విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినులు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప కథను వెండితెరపైకి మళ్లీ తీసుకురావడం ఓ గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉంది. విష్ణు నటన కన్నుల విందుగా అనిపించింది. కన్నప్ప జీవితాన్ని మరోసారి ఇంత అద్భుతంగా తీసిన నిర్మాత మోహన్ బాబు గారికి ధన్యవాదాలు. సినిమా ఆద్యంతం రోమాంచితంగా ఉంది. సంపూర్ణమైన భక్తి రస చిత్రంగా తీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈ రోజు నాగ సాధవులు, సాధువులు, మాతాజీలు, యోగినులు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారు" అని అన్నారు.
Mohan Babu
Kannappa movie
Manchu Vishnu
Ghazal Srinivas
Vijayawada
Devotional movie
Telugu cinema
Naga Sadhus
Spiritual film
Akshay Kumar

More Telugu News