Nara Lokesh: నారా లోకేశ్ బెంగళూరు టూర్ సక్సెస్... ఒక్కరోజులో విశాఖకు రెండు భారీ ప్రాజెక్టులు!

Nara Lokesh Bangalore Tour Success Two Major Projects for Visakhapatnam
  • నేడు బెంగళూరులో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • విశాఖకు భారీగా తరలిరానున్న పెట్టుబడులు
  • రూ.1500 కోట్లతో సత్వా గ్రూపు మిక్స్ డ్ డెవలప్‌మెంట్ క్యాంపస్
  • 10 వేల ఉద్యోగాలతో ఏఎన్ఎస్ఆర్ జీసీసీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
  • లోకేశ్ ఒక్కరోజు పర్యటనతో 35 వేల ఉద్యోగాల కల్పన
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ బెంగళూరులో జరిపిన పర్యటన భారీ విజయాన్ని సాధించింది. ఆయన పర్యటన ఫలితంగా విశాఖపట్నానికి రెండు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా నగరంలో ఏకంగా 35 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మంత్రి నారా లోకేశ్ మంగళవారం నాడు బెంగళూరులో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపు ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే ఆ సంస్థ విశాఖలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1500 కోట్ల వ్యయంతో 'సత్వా వాంటేజ్' పేరుతో ఒక అధునాతన మిక్స్ డ్ డెవలప్‌మెంట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సత్వా గ్రూపు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 25 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేడ్-ఏ ఆఫీసులు, ప్రీమియం నివాస గృహాలు ఈ క్యాంపస్‌లో భాగంగా ఉంటాయి.

ఇదే పర్యటనలో భాగంగా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటులో పేరొందిన ఏఎన్ఎస్ఆర్ సంస్థతో కూడా ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ఏఎన్ఎస్ఆర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేసింది.


Nara Lokesh
Andhra Pradesh
Visakhapatnam
Satya Group
ANSR Group
Investment
IT Minister
Jobs
GCC Innovation Campus
Satya Vantage

More Telugu News