Rajasekhar Babu: టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై వేటు... కారణం ఇదే!
- అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్న టీటీడీ ఏఈవో
- ఓ భక్తుడి ఫిర్యాదు
- విచారణ జరిపిన టీటీడీ విజిలెన్స్ అధికారులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్నాడని టీటీడీ నిర్ధారించింది. ఈ మేరకు రాజశేఖర్ బాబును విధుల నుంచి సస్పెండ్ చేసింది. రాజశేఖర్ బాబు గత కొంతకాలంగా పుత్తూరులో అన్యమత ప్రార్థనలకు హాజరవుతున్న విషయాన్ని ఓ భక్తుడు ఫొటోలు తీసి టీటీడీ దృష్టికి తీసుకువచ్చాడు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి, రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం నాడు అన్యమత ప్రార్థనా మందిరానికి హాజరవుతున్నట్టు గుర్తించింది. ఇది టీటీడీ నియమావళికి విరుద్ధం కావడంతో, ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు.