తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం
- తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం
- రెండు దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం
- విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్న అధికారులు
భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా దుకాణాల్లోని ఇత్తడి సామాన్లు, బొమ్మలు కాలిపోయాయి. ఒక దుకాణంలో విద్యుత్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.