స్వేఛ్చ ఆత్మహత్య కేసు... లొంగిపోయిన పూర్ణచందర్... 14 రోజుల రిమాండ్
- యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ అరెస్ట్
- పూర్ణచందర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
- పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు
- తన వెనుక ఓ రాజకీయ నేత ఉన్నారని కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడి
- పెళ్లి పేరుతో స్వేచ్ఛను మోసం చేసి, బెదిరించినట్లు అంగీకారం
స్వేచ్ఛ, పూర్ణచందర్ వారం రోజుల క్రితం ఇద్దరూ కలిసి అరుణాచలం వెళ్లి, మూడు రోజుల క్రితమే నగరానికి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ.. పూర్ణచందర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని విగతజీవురాలిగా కనిపించింది. స్వేచ్ఛకు ఓ కుమార్తె ఉంది.