ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ ఫైర్
- ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందన్న రాహుల్ గాంధీ
- వారికి రాజ్యాంగం వద్దు. మనుస్మృతి కావాలని మండిపడ్డ రాహుల్
- రాజ్యాంగ పీఠిక వివాదంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగిపోయిందని, వారికి కావలసింది మనుస్మృతి మాత్రమేనని, భారత రాజ్యాంగం కాదని రాహుల్ ధ్వజమెత్తారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదం గురించి చెబుతున్న రాజ్యాంగం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు నచ్చదని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా హరించి వారిని మళ్లీ బానిసలుగా చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు.
రాజ్యాంగం వంటి శక్తిమంతమైన ఆయుధాన్ని వారి నుంచి లాక్కోవడం వారి నిజమైన ఎజెండా అని, ఆర్ఎస్ఎస్ ఇలాంటి కలలు కనడం మానేయాలని, తాము వారిని ఎప్పటికీ విజయవంతం కానివ్వమని రాహుల్ స్పష్టం చేశారు.