కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్
- అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని
- ఇరాన్ అణు ముప్పు తొలగిందని ప్రకటన
- పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ వాతావరణం
వివరాల్లోకి వెళితే.. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా, తాము కూడా సీజ్‌ఫైర్‌కు కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం వాస్తవమేనని ధ్రువీకరించినట్లయింది.