మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై రోజా స్పందన
- కుప్పం నియోజకవర్గంలో ఘటన
- భర్త అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసిన వైనం
- టీడీపీ నేతలు బరితెగిస్తున్నారన్న రోజా
అప్పు తీర్చలేదని ఒక ఆడబిడ్డను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన దారుణమని అన్నారు. అధికారం చేతిలో ఉంటే విచక్షణ మరిచిపోయి ఇంతలా బరితెగిస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఇదేనా మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అంటూ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.