Yogalakshmi: కుర్రాళ్లంతా సెర్చ్ చేస్తున్న అందమైన ఆ కళ్లు ఇవే!

Yoga Lakshmi Special
  • తమిళనాడుకు చెందిన యోగలక్ష్మి 
  • 'హార్ట్ బీట్' తో పాప్యులర్ 
  • 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో క్రేజ్
  • యూత్ వైపు నుంచి పెరుగుతున్న ఫాలోయింగ్

అందానికి మరింత అందాన్ని తెచ్చేవి  .. ఆకర్షణకి మరింత ఆకర్షణ పెంచేవి కళ్లే. అందమైన కళ్లు మాట్లాడతాయి .. పాటలు పాడతాయి .. పాఠాలు కూడా చెబుతాయి. ఆ మాటకొస్తే మాటల్లో చెప్పలేని భావాలను ఆవిష్కరించే అందమైన వాకిళ్లు కళ్లు. తళుక్కుమని మెరిసే కనుల నుంచి కరెంటు పుడుతుందనే విషయం కుర్రాళ్లందరికీ తెలుసు. అలాంటి కళ్లున్న అమ్మాయి కనిపిస్తే, కలలు కనని కళ్లు ఉండవు. అలా ఇప్పుడు కలల్లో తేలిపోతున్న కుర్రాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పటి నుంచి అంటే, 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాలో 'యోగలక్ష్మి'ని చూసినప్పటి నుంచి అనే చెప్పాలి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రాఘవన్ కూతురు 'కురల్' పాత్రలో ఆమె కనిపిస్తుంది. కథానాయకుడు ధర్మదాస్ పెద్ద కొడుకుతో ప్రేమలో పడుతుంది. ఈ పాత్రలో 'యోగలక్ష్మి' కనిపించింది అక్కడక్కడే అయినా, ఆకర్షణీయమైన కళ్లతో ..  పదునైన చూపులతో విన్యాసాలు చేసింది. దాంతో అసలు ఈ అమ్మాయి ఎవరూ అనేది తెలుసుకోవడానికి కుర్రాళ్లంతా సెర్చ్ చేయడంలో పడ్డారు.తమిళనాడుకు చెందిన యోగలక్ష్మి ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసింది .. వెబ్ సిరీస్ లు చేసింది. అయితే ఇటీవల హాట్ స్టార్ కి వచ్చిన 'హార్ట్ బీట్'తో ఆమె చాలామంది కళ్లలో పడింది. ఈ సిరీస్ లో ఆమె నెగెటివ్ టచ్ ఉన్న పాత్రను చేసినప్పటికి, మంచి మార్కులు కొట్టేసింది. అందుకు కారణం నేరేడుపండ్ల లాంటి ఆమె కళ్లు .. అవి సంధించిన చురుకైన చూపులే అని చెప్పాలి. 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ఈ బ్యూటీ, ఇకపై సినిమాలలో మరింత బిజీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. 
Yogalakshmi
Tourist Family movie
Tamil actress
Heart Beat web series
beautiful eyes
Indian actress
Tamil Nadu
Kurral
Raghavan
web series

More Telugu News