పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్
- జనసేన పల్నాడు జిల్లా నేత పోలీసులకు ఫిర్యాదు
- అరెస్టు చేసిన నరసరావుపేట గ్రామీణ పోలీసులు
- నిందితుడిని ములకలూరుకు చెందిన ఇర్ఫాన్‌గా గుర్తింపు
లక్ష్మీనారాయణ ఫిర్యాదు ప్రకారం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 4న గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన ఇర్ఫాన్.. సోషల్ మీడియాలో పవన్‌పై దూషణలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ములకలూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌ను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.