మాంసం వినియోగంలో తెలంగాణ టాప్!
- మాంసాహారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఏడో ర్యాంకు
- నెలకు సగటున ఒక వ్యక్తి 2 కిలోల మాంసం వినియోగం
- నాగాలాండ్‌లో 99.8 శాతం మంది మాంసాహారులే
- ఏపీ, తెలంగాణ, తమిళనాడులో చికెన్, మటన్‌తో పాటు చేపల వినియోగమూ ఎక్కువ
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల మాంసాహారపు అలవాట్లు కూడా విభిన్నంగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఉదాహరణకు.. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చికెన్, మటన్‌తో పాటు చేపలను కూడా అధికంగా తింటారు. ఒడిశా ప్రజలు రొయ్యలను ఇష్టంగా భుజిస్తారు. మరోవైపు, త్రిపురలో పంది మాంసం వినియోగం ఎక్కువగా ఉండగా, గోవాలో చేపలు, పీతల వంటి సముద్ర ఆహారం (సీఫుడ్) ఎక్కువగా తింటున్నారని సర్వే స్పష్టం చేసింది.