కాకాణిని వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు... కోర్టుకు చేరుకున్న అనిల్ యాదవ్
- అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకాణిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 55 రోజుల తర్వాత పోలీసులకు చిక్కిన కాకాణి
- కోర్టు వద్ద 144 సెక్షన్ అమలు
నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాలుగో నిందితుడిగా (ఏ4) ఉన్నారు. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు చేపట్టడం, దాన్ని తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, అడ్డుకున్న గిరిజనులను బెదిరించడం వంటి పలు తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. దాదాపు 55 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను నిన్న సాయంత్రం బెంగళూరు సమీపంలోని ఒక రిసార్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.