'సీఎం సీఎం' అంటూ కవిత అనుచరుల నినాదాలు... కనిపించని కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు
- అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత
- ఎయిర్ పోర్ట్ వద్ద కవిత కటౌట్లు, బ్యానర్లు
- కనిపించని బీఆర్ఎస్ జెండాలు
అక్కడికి చేరుకున్న అభిమానులు 'సీఎం సీఎం', 'కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి', 'జై కవితక్క' అని పెద్దగా నినాదాలు చేశారు. తన కుమారుడి కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ నెల 16న కవిత తన భర్త అనిల్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. కాగా, కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.