జర్మనీలో రైల్వే ప్లాట్ ఫామ్ పై నిల్చున్నవారిపై దుండగుడి దాడి
- జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన
- వ్యక్తులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఓ దుండగుడు
- నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు
తొలుత ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని హామ్‌బర్గ్ పోలీసులు 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఈ దాడిలో ఒక్కడే పాల్గొన్నాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.