జనావాసాలపై కూలిన విమానం.. అమెరికాలో భారీ విధ్వంసం.. వీడియో ఇదిగో!
- కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో గురువారం అర్ధరాత్రి దుర్ఘటన
- పైలట్ సహా ఇద్దరు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- పదిహేను ఇళ్లు, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం
ప్రమాదానికి గురైన విమానం సెస్నా రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు మరణించారని, జనావాసాలపై విమానం కూలినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయని శాన్ డియాగో అగ్నిమాపక శాఖ సహాయ ప్రధాన అధికారి ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.