ఆర్మీకి 5 నెలల జీతం విరాళంగా ప్రకటించిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే
- ఆర్మీకి ఐదు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
- ఆళ్లగడ్డలో దేశ సైనికులకు సంఘీభావంగా తిరంగా రన్ నిర్వహణ
- ఆళ్లగడ్డలో పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన
పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని అన్నారు. తన ఐదు నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే మంచి మనసును అందరూ ప్రశంసించారు.