పరిగి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. నలుగురి దుర్మరణం
- వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
- మృతుల్లో ఇద్దరు మహిళలు.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- విందులో పాల్గొని తిరిగి వస్తుండగా జరిగిన ఘటన
ప్రమాద తీవ్రతకు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ప్రమాదంలో 20 మందికిపైగా గాయపడగా వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు విందు నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో చెన్వెళ్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.