అమరావతి పునర్ నిర్మాణానికి బటన్ నొక్కిన ప్రధాని మోదీ
- నేడు అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం
- రాజధాని అమరావతిలో భారీ సభ
- లక్షలాది మంది సమక్షంలో రాజధాని పనులకు శ్రీకారం చుట్టిన మోదీ
బటన్ నొక్కి రాజధాని పనులు సహా మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో రాజధాని పనుల విలువ రూ.49,040 కోట్లు. రూ.8 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఇవాళ్టి కార్యక్రమంలో మొత్తంగా 18 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు.