నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
- పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
- ఎస్టీ కాలనీలోని అంకోజి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి
- కూతురు, కొడుకుకి ప్రభుత్వం తరపున సాయం ప్రకటన
టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె ఐదేళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి, చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజి, సుమ కుమారుడుకి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.