HIT 3: 'హిట్' సిరీస్‌లో నాలుగో సినిమా హీరో అత‌డేనా..? క్లైమాక్స్‌లో మెరిసిన కోలీవుడ్ స్టార్!

HIT 3 Karthis Stunning Cameo and Speculations about HIT 4
  • నాని హీరోగా శైలేశ్‌ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో 'హిట్‌3'
  • ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా
  • మూవీ క్లైమాక్స్‌లో మెరిసిన కోలీవుడ్ స్టార్ న‌టుడు కార్తి
'హిట్' సిరీస్‌లో భాగంగా ఈరోజు విడుద‌లైన సినిమా 'హిట్3: ది థ‌ర్డ్ కేస్‌'. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేశ్‌ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే, ఇందులో కోలీవుడ్ స్టార్ న‌టుడు కార్తి అతిథి పాత్ర‌లో న‌టించారంటూ చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 

గురువారం 'హిట్‌3' విడుద‌ల కావ‌డంతో ఆ ప్ర‌చారంపై క్లారిటీ వ‌చ్చేసింది. కొంత‌కాలంగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నిజం చేస్తూ ఈ మూవీ క్లైమాక్స్‌లో కార్తి మెరిశారు. ర‌త్న‌వేలు పాండియ‌న్ అనే పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించారు. "దేశ‌మంటే మట్టికాదోయ్‌... దేశ‌మంటే మ‌నుషులోయ్" అంటూ ప్ర‌ముఖ క‌వి శ్రీ గుర‌జాడ అప్పారావు క‌విత్వాన్ని త‌న‌దైన స్టైల్‌లో చెబుతూ కార్తి ఎంట్రీ ఇచ్చారు. 

ఆయ‌న ఎంట్రీకి సంబంధించిన వీడియోల‌ను షేర్ చేస్తున్న నెటిజ‌న్లు.. కార్తి ఎంట్రీ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే 'హిట్' యూనివ‌ర్స్‌లో నాలుగో సినిమా (ఫోర్త్ కేస్) హీరో కార్తినే అంటూ క‌న్ఫార్మ్ చేసేస్తున్నారు. ఇంత‌కుముందు 'హిట్' సిరీస్‌లోని తొలి రెండు సినిమాల్లో కూడా క్లైమాక్స్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన హీరోల‌నే శైలేశ్ కొల‌ను హిట్ సిరీస్ లోని త‌ర్వాతి సినిమాలకు హీరోగా ఎంచుకున్నారు. దీంతో నాలుగో సినిమాలో హీరో కార్తినే అంటున్నారు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి.   
HIT 3
Karthi
HIT Universe
Kollywood Actor
Guest Role
Natural Star Nani
Sailesh Kolanu
Telugu Cinema
Tollywood
Hit Movie Series

More Telugu News