Unknown Youth: ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య.. బీహెచ్ఈఎల్ లో ఘోరం

Youth Dies by Suicide Jumping from BHEL Flyover
--
హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ సర్కిల్ లో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్కిల్ లోని ఫ్లైఓవర్ పైనుంచి దూకి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామచంద్రాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ సర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకాడు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. 

అయితే, తీవ్ర గాయాల కారణంగా యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు.. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడనే వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Unknown Youth
BHEL Circle
Hyderabad
Flyover Suicide
Ramchandrapuram Police
Suicide Case
Andhra Pradesh
India
Tragedy
Death

More Telugu News