రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Rayalaseema Express Train Robbery Shocks Andhra Pradesh
          
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. 

అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Rayalaseema Express
Train Robbery
Gutthi
Anantapur District
Tirupati
Nizamabad
Railway Police
Crime
Andhra Pradesh
Robbery in Rayalaseema Express

More Telugu News