మంగళసూత్రం లాక్కెళుతుంటే వెంటాడి పట్టుకున్న దంపతులు.. కీసరలో ఘటన
--
కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు చింతల పద్మ తెలిపారు. భర్తతో కలిసి బైక్ పై వెళుతుంటే వెనక నుంచి వచ్చిన దొంగ తన మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.