Virat Kohli: వీరవిహారం చేసిన కోహ్లీ, పడిక్కల్... ఆర్సీబీ భారీ స్కోరు

Kohli and Padikkal Power RCB to Massive Score
షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అర్ధసెంచరీలతో అదరగొట్టగా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ మెరుపులు మెరిపించిన వేళ... ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. 

ఫిల్ సాల్ట్, కోహ్లీ జోడీ తొలి వికెట్ కు 61 పరుగులతో శుభారంభం అందించింది. సాల్ట్ 26 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో అవుటయ్యాడు. కోహ్లీ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. పడిక్కల్ 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేయడం విశేషం. టిమ్ డేవిడ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేయగా... జితేశ్ శర్మ దూకుడుగా ఆడి 10 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (1) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2, ఆర్చర్ 1, హసరంగ 1 వికెట్ తీశారు. ఇన్నింగ్స్ చివరి బంతికి టిమ్ డేవిడ్ రనౌట్ అయ్యాడు.
Go Back to Shorts
Virat Kohli
Devdutt Padikkal
RCB
Royal Challengers Bangalore
Rajasthan Royals
IPL 2024
Cricket Match
T20 Cricket
Kohli's innings
Padikkal's fifty

More Telugu News