సొంతగడ్డపై సన్ రైజర్స్ మ్యాచ్... టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్

Sunrisers Hyderabad vs Mumbai Indians MI Wins Toss Opt to Bowl
ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ ఢీకొంటున్నాయి. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక.

ఇటీవల వాంఖెడేస్టేడియంలో ముంబయి ఇండియన్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే చాన్స్ సన్ రైజర్స్ కు లభించింది. మరి సొంతగడ్డపై కమిన్స్ అండ్ కో ఎలా ఆడుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. టాస్ ఓడినా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో... సన్ రైజర్స్ తన ట్రేడ్ మార్క్ ఫైర్ వర్క్స్ చూపిస్తారా అని అభిమానులు ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్ కోసం మహ్మద్ షమీని పక్కనబెడుతున్నట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షమీ స్థానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడని వివరించాడు. 

అటు, ముంబయి ఇండియన్స్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. అశ్వని కుమార్ స్థానంలో విఘ్నేశ్ పుతూర్ ను తుదిజట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.
Go Back to Shorts
Sunrisers Hyderabad
Mumbai Indians
IPL 2023
Rajiv Gandhi International Stadium
Pat Cummins
Hardik Pandya
Hyderabad
Cricket Match
Jaydev Unadkat
Vignesh Puthur

More Telugu News