పహల్గామ్ దాడి తర్వాత పాక్ లో టెన్షన్.. సరిహద్దులకు యుద్ధ విమానాలు..!
--
ఫ్లైట్ రాడార్ డాటాలో పాకిస్థాన్ వాయుసేన విమానాలు కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం పాకిస్థాన్ ముఖ్యమైన ఆపరేషనల్ బేస్‌లలో ఒకటి.. ఈ నేపథ్యంలోనే బేస్ భద్రతా ఏర్పాట్లను పాక్ పటిష్ఠం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపు వార్తలపై అటు పాకిస్థాన్ కానీ, ఇటు భారత అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.