లక్నోతో పోరు... టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
టాస్ సందర్భంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ కు మీడియం పేసర్ మోహిత్ శర్మ స్థానంలో దుష్మంత చమీర ఆడుతున్నాడని వెల్లడించాడు. మరోవైపు, తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ తెలిపాడు.
పాయింట్ల విషయానికొస్తే... ఢిల్లీ జట్టు 7 మ్యాచ్ ల్లో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, లక్నో జట్టు 8 మ్యాచ్ ల్లో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.